Thursday, July 5, 2012

ప్రయాణ సన్నాహాలు

దైవసంకల్పముతో మేము చతుర్ధామ యాత్రకు పిబ్రవరిలో సమాచార సేకరణ మొదలుపెట్టాము.
చాలమంది సలహామేరకు " సదరన్ ట్రావాల్సు" అనే సంస్థలో మా ప్రయాణమునకు టిక్కట్లు తీసుకునేందుకు నిర్ణయము తీసుకున్నాము. మాతమ్ముడు చి.పార్ధసారధి గతంలో తనకి కుడా ఈ యాత్ర చేయాలనే కోరిక ఉందని నాతోచెప్పిఉండటంతో గుంటూరులో నున్న తమ్ముడికి విషయాలన్నీ వివరించాను. తమ్ముడు నిర్ణయము తీసుకొని తనకు, తనధర్మపత్ని కుడా    టిక్కట్లు తీసుకొనేందుకు పైకము నా ఖాతాలో .జమచేశాడు టెక్నాలజీ సౌకర్యము కదా! ఆ సాయంకాలము  సదరన్ ట్రావాల్సు వారిని సంప్రదించి  జూన్ 20న మా ప్రయణము కొరకు టిక్కట్లు రిజర్వు చేసుకున్నాము. మేము అక్కడనుండి బయలుదేరే సమయానికి మిత్రులు శ్రీ చంద్రమౌళి గారు తమకు తనధర్మపత్నిశ్రీమతి సావిత్రి గారికి కుడా టిక్కట్లు అదే రోజుకు తోసుకొనమని ఫోనులో రిక్వెస్టు చేశారు.  మొత్తం ఆరు టిక్కట్లు రిజర్వు చేసుకుని ఇంటికి తిరిగివచ్చాము. ఇక్కడ తెలుసుకోదగ్గ విషయమేమిటంటే సదరన్ ట్రావాల్సు వారు ఇరవై నాలుగు గంటలు తమ ఆఫీసు కష్టమర్ల సౌకర్యము కొఱకు  తెరచి ఉంచుతారు.

No comments:

Post a Comment